CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నివురు గప్పిన నిప్పులా నిరుద్యోగం.పి.వై.ఎల్ జిల్లా నిర్మాణ జనరల్ బాడీ లో వక్తలు

Share it:




మన్యం మనుగడ వెబ్ డెస్క్:

దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను పాలకులు ప్రైవేట్ పరం చేయడంతో నిరుద్యోగ తీవ్రత మరింత పెరిగిందని పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యస్. ప్రదీప్ అన్నారు. సోమవారం పగడాల వెంకన్న హాల్ ( ఎల్లన్న విజ్ఞాన భవన్) లో జిల్లా స్థాయి పి.వై.ఎల్ నిర్మాణ జనరల్ బాడీ జరిగింది. 

 ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు పెరిగి ప్రతి 45 నిమిషాలకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితి నేడు దేశంలో ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అని చెప్పి, కొన్ని ఉద్యోగాలకే ప్రకటన చేసి, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి పాలకులు చేపట్టడం లేదన్నారు. 

సి.పి. ఐ (ఎం.ఎల్) ప్రజా పంథా జిల్లా నాయకులు నాయిని రాజు మాట్లాడుతూ..

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతను అతి దారుణంగా హత్య చేస్తున్నారని, ఇలాంటి ఉదంతమే నాగరాజు హత్య అన్నారు. దీనిని ఆసరా చేసుకుని మతాల పట్ల విద్వేషం పెంచే పనిలో బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రేమికులను చంపడం, పెళ్లి చేసుకుంటే పరువు పేరుతో హత్యలు పెరుగుతున్నాయని అన్నారు. పాలకుల విధానాల వలనే జరుగుతున్నాయని ఆరోపించారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న యువ జంటకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని అన్నారు.


ముందుగా పి.వై.ఎల్ బిగిపిడికిలి జెండాను వాంకుడోత్ అజయ్ ఆవిష్కరణ చేశారు. 


ఈ కార్యక్రమంలో వాసం బుచ్చిరాజు, యనగంటి గణేష్, కాకా వెంకటేష్, బండారి సత్యం, కొర్సా రామకృష్ణ, యనగంటి గణేష్, సోయం చందర్రావు, గంగాధరి భాస్కర్, ధరావత్ దేవా, కట్టం రాంబాబు, కుంజ అర్జున్, ఇస్లావత్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: