CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.రైతు పండించిన ప్రత్తి పంట ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుంది.

Share it:

 


  • తెలంగాణ ఇచ్చిన పార్టీని ప్రజలు ఆశీర్వదించండి.
  • రైతులను నట్టేట ముంచిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.
  • సింగారం,ఏటూరు గ్రామాలలో రైతు డిక్లరేషన్ రచ్చబండ.
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

కన్నాయిగూడెం మండలంలోని సింగారం ఏటూరు గ్రామాలలో రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ,ఇందిరమ్మ రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు 15000/ రూపాయలు ఇస్తామని, ఉపాధి హామీ లు నమోదు చేసుకున్న భూమి లేని రైతుకూలీలు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని రైతుల పంటకు గిట్టుబాటు ధర,రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని,పంట ధరలు ముందే నిర్ణయిస్తామని, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, పసుపు బోర్డు ను ఏర్పాటు చేస్తామని, మెరుగైన పంటల బీమా ను తీసుకొస్తామని,రైతు కూలీలకు భూమిలేని రైతులకు బీమా,ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామని, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యజమాని హక్కు ధోరణి పోర్టల్ ను రద్దు చేస్తామని అన్నారు.మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని నకిలీ పురుగుమందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అమ్మే సంస్థల పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామని రైతుల సమస్యలు శ్వాస పరిష్కారానికి చట్టపర అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని, వ్యవసాయాన్ని పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఉపాధి హామీ సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని అన్నారు. అసమర్థత బిజెపి టిఆర్ఎస్ పార్టీలో పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా సీతక్క రైతులను ఉద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిట మట రఘు,జడ్పి టి సి నామకరణం చందు గాంధీ, ఎంపీపీ జనగం సమ్మక్క,వైస్ ఎంపీపీ బోల్లె భాస్కర్, ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తోట రాంబాబు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు రాంబాబు, జిల్లా నాయకులు జాడి రాంబాబు,వావిలాల చిన్న ఎల్లయ్య,నర్సింగరావు, బాలరాజు,సాంబశివ, నర్సింగరావు,లచ్చు బాబు, నగేష్,వెంకటయ్య,సత్యం, శ్రీరాములు,చలపతి,భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: