CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం..అధికారంలోకి వస్తాం రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. కొత్తూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య...

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

 దుమ్ముగూడెం మండలం కొత్తూరు గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమానికి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం కొత్తూరు గ్రామంలో మొదలైన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే టి పి సిసి ఉపాధ్యక్షుడు పొదెం వీరయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్, బిజెపి పార్టీలు అవలంభిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలందరు గమనిస్తున్నారని కేంద్ర, రాష్ట్ర పార్టీలు ముమ్మాటికీ రైతుద్రోహ పార్టీలని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య విమర్శించారు. పూర్తిగ. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అన్ని గ్రామాల్లో గడప గడపకు ప్రచారం చేయబోతున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు కరువు , నకిలీ విత్తనాలు, మద్దతుధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర అసమర్థ పాలన వల్ల రైతులు అనేక విధానాలతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం, ఎకరాకు 15 వేలు సాగుబడికి ఇస్తామని, భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12 వేల రూపాయలు ఇస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ను ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా లోని అన్ని గ్రామాలకు వెళ్తుందని రచ్చబండ ద్వారా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నిలదీస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమము లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చింతిరాల సుధీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రదీప్, లంక అబ్బులు, పిలక వెంకట్ రెడ్డి, దర్శి సాంబశివరావు, ఉబ్బా వేణు, తెల్లం నరేష్, సోషల్ మీడియా మిత్ర, కనుబుద్ది దేవా నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: