CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట లో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు.-నూతన అధ్యక్షుడిగా ఉదయరాఘవేందర్.జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకై పోరాటం.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేటలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటైంది. ఆదివారం నాడు అంకమ్మ చెరువు గట్టు మీద జరిగిన సమావేశంలో ప్రస్తుత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలుపై విస్తృతంగా చర్చించారు. జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి జర్నలిస్టులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఈ క్రమంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కర్తవ్యాల సాధన కోసం నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉదయరాఘవేందర్ (మాభూమి), ఉపాధ్యక్షులుగా పల్లెల వెంకటేశ్వరరావు (జనంసాక్షి), గంధం వెంకటేశ్వరరావు (ఎఫ్ఎన్ఐ ఛానల్ ), ప్రధాన కార్యదర్శిగా పెనుగొండ సత్యనారాయణ (డిఎన్ బి న్యూస్), సహాయ కార్యదర్శులుగా ముళ్ళగిరి రమేష్ (ప్రజా ప్రతినిధి), కేసుపాక నర్సింహారావు (తేజ టీవీ), కోశాధికారిగా కొర్రి వెంకటేశ్వర్లు (టీటివి) తో పాటు 15 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జి ఉదయ రాఘవేందర్, పెనుగొండ సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలి , మీడియా పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు అనేక హామీలు గుప్పించిన కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో ఆ హామీలను విస్మరించిందని వారు విమర్శించారు. జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించి జర్నలిస్టులను అంటరానివారిగా చూస్తున్నారన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు కలగానే మిగిలాయన్నారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులంతా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన ఐక్యత ప్రెస్ క్లబ్ అశ్వారావుపేట ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై ఉద్యమించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కూనా చిన్నారావు, ఫ్రాన్సిస్, నార్లపాటి సోమేశ్వరరావు, యర్రం అప్పారావు, మాలోత్ నాగేశ్వరరావు, జుజ్ఙారపు రాంబాబు, షేక్ ఇబ్రహీం, అంపోలు కనకారావు, రాజపుత్ర నందు, పద్దం రాజ్ కిరణ్, మద్దు రవి, తొర్లపాటి సాంబశివరావు, దాది చంటి, చిప్పనపల్లి శ్రీను, గన్నవరపు రాజు, శ్రీనివాసరావు, బొక్క రాంబాబు, కేదాసి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: