CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూర్ నాగారం మండల కేంద్రంలో అంబేద్కర్ 131 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళిత ప్రజాసంఘాలు తెలంగాణ మాల మహానాడు. మహాజన సోషలిస్టు పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.బి ఎస్ పి. నేతకాని హక్కుల పోరాట సమితి.దళిత ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పలువురు దళిత ప్రజాసంఘాల నాయకులు దళిత ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. అనంతరం దళిత ప్రజా ప్రతినిధి జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ,తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్,మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు. వావిలాల సాంబశివరావు,బి ఎస్ పి పార్టీ నాయకులు కర్ణ రమేష్. ఎం పెళ్లి శంకర్,రాజు, ఎంఆర్పిఎస్.రాము,సతీష్. నేతకని హక్కుల పోరాట సమితి నాయకులు మల్లయ్య, నాయకులు మాదరి మధు, గంపల నర్సయ్య లు మాట్లాడుతూ. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అని మన ఆశయాలను వివరించారు. అంబేద్కర్ ఆశయాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అన్నారు. భారత దేశ ప్రజలందరికీ స్పూర్తిదాయకంగా అంబేద్కర్ ప్రపంచమంతా నిలవడం జరిగిందని అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం ద్వారానే నేడు చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరచడం ద్వారా నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. భారతీయ సమాజంలో అనగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా విశ్వ మానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి అన్నారు దళితులు బహుజనులు ప్రజలు అంబేద్కరిజం గా నిలిచారన్నారు. విశ్వ మానవాళి నేడు అంబేద్కర్ ను దేవుడిగా పూజిస్తున్నారు అన్నారు. ములుగు జిల్లా లో అత్యధికంగా దళిత జనాభా ఎక్కువగా ఉండడంతో ములుగు జిల్లా కు అదనంగా మరో రెండు వందల బంధు పథకం యూనిట్లు మంజూరు చేయాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ప్రకటించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట పలు ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: