CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గురుకుల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.క్రీడా పాఠశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి.

Share it:


  • పాఠశాల పౌండర్ ప్రిన్సిపాల్ బివి రమణ మూర్తి.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనంకు పూర్వ గురువులు,విద్యార్థులు హాజరై పాఠశాల ఆవరణంలో గల వేదిక పై సమావేశం జరిగింది.ఈ సమావేశంనకు ప్రస్తుత పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట రాజు సభా అధ్యక్షత వహించారు.ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఏటూరునాగారం పూర్వ విద్యార్థుల మొదటి రోజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై,అనంతరం పాఠశాలలో పని చేసి అసు వులు బాసిన గురువులకు

,పాఠశాల సిబ్బంది,

విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి వి రమణమూర్తి హాజరై మాట్లాడుతూ.అరకొర వసతులతో 1984 అక్టోబర్ 28 నాడు ఏటూరునాగారం గ్రామంలో ఒక అద్దె ఇంటిలో 5,వ తరగతి నుండి పాఠశాల ప్రారంభమైందని అన్నారు.

కనీస సౌకర్యాలు లేని సమయంలో పాఠశాల ప్రారంభమై నేడు ఇంటర్ మీడియట్ క్రీడా పాఠశాలగా ఆఫ్ గ్రేడ్ చేయబడిందని అన్నారు.1990సంవత్సరంలో 10తరగతి మొదటి బ్యాచ్ నుండి 2021వరకు ఎందరినో ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాలఅని కొనియాడారు. ఇంతటి ఘనతను సాధించిన పాఠశాల 32 ఎస్ ఎస్ సి బ్యాచ్ ల గురువులు,విద్యా ర్థులతో అపూర్వ మహా సమ్మేళనం జరుపుకోవడం బిడ్డలను(విద్యార్థులు)చూడటం,చదువు చెప్పిన ప్రదేశం, వాతావరణను చూడటం దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా అభివర్ణించారు.ఆనాటి మాజీ ప్రధాని మాన్ మోహన్ సింగ్,గవర్నర్ కుమారి కుముద్ బెన్ జోషి,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సందర్శించి పాఠశాల అభివృద్ధికి ఎంతో సహకరిం చారని కొనియాడారు.

37ఎకరాలతో విస్తరించి ఉన్న పాఠశాల ఇంటర్మీడియట్ నుండి క్రీడా పాఠశాల గా వృద్ధి చెందినప్పటికీ క్రీడా విద్యా ర్థులకు ప్రత్యేకమైన మెనూ లేకపోవడంతో విద్యార్థులు క్రీడా నైపుణ్యం సాధించలేక పోతున్నారని వాపోయారు.

ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ ప్రభుత్వ ప్రవేట్,పారిశ్రామిక రంగాలు విద్యావేత్తలు గా స్థిరపడి ఉన్న వారు పాఠశాల అభివృద్ధికి మరియు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల కుటుంబాలకు విద్య, వైద్యం,ఆర్థికం,ఉద్యోగ పరంగా కెరీర్ మార్గదర్శకాలు ఇవ్వాలని పూర్వ విద్యార్థులను కోరారు. అనంతరం వచ్చిన పూర్వ గురువులు అతిథులతో పాఠశాల సావనీరు పుస్తకమును ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ గురువులు సుదర్శన్, పాపయ్య,రవీందర్ రేడ్డి,

గురువప్ప,రవిచందర్, ఇమ్మానియేల్,అజిజ్, నారాయణ రెడ్డి,వెంకటేశ్వర్లు, సత్తయ్య,సత్యనారాయణ రెడ్డి,వెంకటేశ్వర్లు,ఆచార్య, బురాన్,ఉపేందర్ రెడ్డి, సదానందం,ఉప్పలయ్య, మహేశ్వరయ్య తో పాటు పూర్వ విద్యార్థులు థౌర్య నాయక్,ఐఆర్ఎస్,రాజ నాయక్ ఫోరెన్సిక్ డిఎస్పి

జితేంద్ర,సైంటిస్ట్,మంగీలాల్ డిజెఎం,డాక్టర్ రాజన్న,చాప బాబు దొర,ప్రోగ్రాం చైర్మన్ కొమురం ప్రభాకర్,ఫుడ్ ఇన్చార్జి పులుసం పురుషోత్తం, మీడియా ఇంచార్జ్ దబ్బగట్ల సుమన్,చందా మహేష్,ఐటిడి ఏ ఏటూరునాగారం స్పోర్ట్స్ అధికారి యాలం ఆదినారా యణ,బంగారు ప్రకాష్,చల్ల లక్ష్మణ్ 32 ఎస్ఎస్సి బ్యాచ్ ల విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: