CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట. --:ఎంపీపీ రేగ కాలిక

Share it:

 


  • 150 కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ

మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండలం తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు ఉషా శారద ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు అందించే రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఎంపీపీ రేగా కాళిక పాల్గొని, పేద ముస్లిం కుటుంబాలకు, రంజాన్ తోఫా అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వారి అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని ఆమె అన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీల అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వారి అభివృద్ధికి కి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, షాదీ ముబారక్ ,వంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని ఆమె అన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూన ప్రభుత్వం అని అన్నారు.పండుగ పర్వదినాన బట్టల పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు .పేద లందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ ఉకే రామనాథం,ఎంపీటీసీ శైలజ, ఆర్ఐ లు,హుస్సేన్,రాజు,కో ఆప్షన్ సభ్యులు సోందు పాషా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోగు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి,చిట్టి సతీష్ ముస్లిం మత పెద్దలు వీఆర్ఏలు వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: