CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మద్యం అధిక ధరలను నియంత్రించాలని దళిత సంక్షేమ సంఘం ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వరావుపేట: పల్లె నుండి పట్టణం వరకు వీధి వీధికి నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను, అందులో మద్యం అధిక ధరలను నియంత్రించాలని మంగళవారం దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు  చేసారు. ఈ సందర్భంగా ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ అశ్వారావుపేట, దమ్మపేట మండలాల మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధీకృత మద్యం షాపుల్లో నిర్ణీత ధరలకు విక్రయించాల్సి ఉన్నందున వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ రూ. 20 లు నుండి రూ.30 ల వరకు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బెల్టు దుకాణదారులు దానినే రూ. 50 లు నుండి 60 లు వరకు మద్యం ప్రియుల దగ్గర అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలిపారు. లైసెన్స్ షాప్ లో దొరకని బ్రాండెడ్ మద్యం బెల్ట్ షాప్ లో దొరుకుతుందని, ఈ బెల్టు షాపులు వలన గ్రామీణ ప్రాంతాలలో కూలి పనులు చేసుకుని జీవించే నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోతూ, కుటుంబ కలహాలు ఏర్పడి కుటుంబాలు వీధుల పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ బెల్టు దుకాణాల వలన గ్రామాలలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన బెల్టుషాపులను,అధిక ధరలకు, మద్యం మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు,

కొమ్మవరపు ప్రతాప్, గంధం సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: