CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సామాజిక చైతన్యం కోసం మహనీయుల జీవిత చరిత్ర చదవడమే మార్గం.

Share it:

 



  •  స్పర్శ సామాజిక అధ్యయన వేదిక స్పర్శ భాస్కర్ .


ఖమ్మం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎవ్వరూ ? ఏం చేశారు ? అనే అంబేడ్కర్ జీవిత చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా సామాజిక చైతన్యానికి నాంది అని అందుకోసమే అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం స్పర్శ సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది . ఈ సందర్భంగా స్పర్శ భాస్కర్ మాట్లాడుతూ మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను భావి తరాలకు అందించటం ద్వారా సామాజిక రుగ్మతలకు గురి కాకుండా చైతన్యం పొంద వచ్చునని ఆయన అన్నారు . స్పర్శ సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు .ఈ అవకాశాన్ని అంబేద్కర్ వాదులు , అభిమానులు , ప్రజాసంఘాలు , కార్యకర్తలు , నాయకులు , విద్యార్థులు , యువకులు , బడుగు , బలహీన వర్గాల ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఉపయోగించుకోవాలని కోరారు .తద్వారా సామాజిక మార్పు , మహనీయులు కలలుగన్న సమాజం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ప్రజా కవి కే.వి. సాకే , సేవలాల్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు బానోత్ కిషన్ నాయక్ , మల్లేష్ యాదవ్ , రాందాస్ నాయక్ , కొమ్ము రమేష్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: