CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మామిళ్ళవారిగూడెం పాఠశాలలో ఘనంగా విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమ్మేళనం.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మామిళ్ళవారిగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈ సంవత్సరం 2021-22 విద్య అభ్యసించిన 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమ్మేళనం బుధవారం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు, పదవ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమ్మేళనం సభ నిర్వహించి చిరు గిఫ్టుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్ష కు సిద్ధం అవుతున్న సందర్భంగా పరీక్షకు కావలసిన మెటీరియల్ కానుకగా అందించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ హెచ్ఎం ఫణి కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం స్కూల్ నందు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించారని ఈ సంవత్సరం కూడా ప్రతి విద్యార్థినీ విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ తో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకొని మంచి మార్కులతో పాసై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే తల్లిదండ్రులకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, ఊరికి, స్కూల్ కి, జిల్లా కి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు స్కూల్ నందు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: