CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుక్కెడు తాగు నీటి కోసం తల్లడిల్లుతున్న శనగ కుంట ప్రజలు.

Share it:

 


  మన్యం మనుగడ, మంగపేట.

శనివారం నాడు మంగపేట మండల పరిధిలోని శనగకుంట గ్రామంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఇంటింటికి తిరిగి గ్రామస్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గిరిజన గ్రామంలో తాగునీరు లేక గిరిజనులు అల్లాడి పోతుంటే ప్రభుత్వ అధికారులు కనీసం స్పందించటం లేదు.గుక్కెడు నీటికోసం గొంతులు ఎండి ప్రజలు వెక్కిళ్లు పడుతుంటే ప్రజలు సమస్యకు పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు,గిరిజనులు అన్నా గిరిజన గ్రామలన్నా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు చిన్నచూపు తగదని ఈ సందర్బంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రతినిధి తాటి కృష్ణ హెచ్చరించారు. సత్వరమే శనగకుంట గగ్రామం సంబంధిత అధికారులు సందర్శించి వారి తీవ్రమైన నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరుచెప్పి ప్రజా ధనం దోచుకొని దాచుకున్నారు తప్పా,ప్రజలకు నీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇలా చాలా గ్రామాలు నీటి సమస్యతో ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని,ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పనులు కుంటు పడ్డాయని,సంక్షేమ పథకాలు కూడా సరిగా అందడం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్ ,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం డి పాషా,మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరేం నర్సింహులు యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేనపెళ్ళి నరేందర్ మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్ మండల కార్యదర్శి ఆక తిరుమల రావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పులిశర్ల వెంకటేశ్వర్లు గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు కల్తీ రామకృష్ణ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొత్నాల కుమార్ శక్తి కేంద్రం ఇంచార్జి బొల్లికండ సాంబయ్య బూత్ అధ్యక్షుడు తాటి నాగరాజు తిమ్మంపేట బూత్ అధ్యక్షుడు వేల్పుల తిరుపతయ్య తొలెం సుధాకర్ ఏళ్ళబోయిన ఎల్లయ్య పసుల ప్రభాకర్ బొడ్డు లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: