CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా,కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాన్ని నిరసిస్తూ 136వ మేడే జరుపుకుందాం.ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మే డే పోస్టర్ ఆవిష్కరణ.

Share it:


మన్యం టీవీ మణుగూరు:         

సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాన్ని నిరసిస్తూ 136వ మేడే జరుపుకోవాలని ఐ.ఎఫ్.టి.యు జాతీయ కమిటీ పిలుపునిచ్చిందని,ఆ పిలుపులో భాగంగా మేడే జరుపుకోవాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు మిడిదొడ్ల. నాగేశ్వరరావు పిలుపునిచ్చారు బుధవారం నాడు సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో 136వ మే డే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు,ఎనిమిది గంటల పని దినం పరిరక్షణకై పోరాడాలని,కార్మిక వర్గానికి నష్ట కరమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి అని,కనీస వేతనం,సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రైవేటు వాహన డ్రైవర్లకు,ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు,ఓబి వర్కర్ల హక్కుల సాధనకై పోరాడాలని,సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు వాటా చెల్లించాలని వేసవి నేపథ్యంలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.అన్ని గనులు డిపార్ట్మెంట్ లలో వాడ వాడలా ఐ ఎఫ్ టి యు జెండా రెపరెపలాడాలని చికాగో అమరవీరులను స్మరిస్తూ, వారికి నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో,ప్రతి శ్రమజీవి పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్,ఎం. భద్రం,సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు కె రవి కుమార్,వి శంకర్,కే.గురుమూర్తి,జి.నాగేశ్వరరావు,కె వీర్రాజు,ఏం. సాంబశివరావు,నాగరాజు,సాయి కుమార్,నగేష్,గోపి,నవీన్ కుమార్,రజబ్ అలీ,వెంకట్ నారాయణ,సమ్మయ్య,చంటి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: