CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సేవలో ఉన్న సంతృప్తి దేనిలోనూ ఉండదు.ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ కృషి చెయ్యాలి.--:డి. ఐ . బాలక్రిష్ణ.

Share it:

 

 


  •  విజయవంతమైన వైద్య శిబిరం

ములకలపల్లి:మార్చి23:(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఆలె బాలకృష్ణ అన్నారు. మానవ సేవలో విభిన్న రూపాలున్నప్పటికీ ఆరోగ్య సేవ అన్నిటికీ మించిన సత్కార్యమని ఆయన అన్నారు.ఏమి ఉన్నా, లేకపోయినా ఆరోగ్యం పదిలంగా ఉంటే సమస్తమూ ఉన్నట్లేనని,అలాంటి ఆరోగ్యాన్ని కొందరికైనా పంచాలన్న చిరుప్రయత్నమే నేటి ఈ శిబిరమని అన్నారు. బుధవారం మండలం లోని జగన్నాధపురం గ్రామ పంచాయితీ, రేగులకుంట గ్రామం బయటివారి గుంపులో సీనియర్ జర్నలిస్టు యండి.ఉస్మాన్ ఖాన్ పర్యవేక్షణలో నిర్వహించిన వైద్యశిబిరం విజయవంతమైందని, రెండు వందలమందికి పైగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించండం తన అదృష్టమని డి. ఐ బాలక్రిష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎంత సంపాదించినా చేసిన మంచే చివరికి మిగిలేదని ఆయన అభిప్రాయపడ్డారు.మన సంపాదనలో ఎంతోకొంత శాతం పేదలకోసం ఖర్చుపేడితే ఆ సంతృప్తి మరెందులోనూ లభించదన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న200 మందికి కొత్తగూడెంకు చెందిన ప్రముఖ వైద్యులు డా. రాఘవేంద్ర (యండి) (రాఘవేంద్ర హాస్పిటల్ ) రోగులను పరీక్షించి వైద్యసేవలు అందించారు. సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఇంతమంచి కార్యక్రమానికి సహకరించిన డి. ఐ బాలక్రిష్ణ గారికి, రోగులకు సేవలందించిన ప్రముఖ యండి డాక్టర్ రాఘవేద్ర అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్వంచ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అద్యక్ష కార్యదర్శులు మేదరమెట్ల శ్రీనివాస్, ఆరుట్ల లక్ష్మణ్,కారుణ్య మెడికల్స్ జునైద్,ఆల్ ఫార్మా స్వరూప్, మన్యంటీవీ రిపోర్టర్ సున్నం ప్రసాద్, యాఖూబ్,గ్రామ పెద్దలు కొర్సాపొట్టి, రాజేష్ ,లక్ష్మణ్ ,ముత్యాలు ఆశా కార్యకర్తకుమారి,సీత,రమణ,పోతప్ప తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: