CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలములు దళిత బంధు లబ్దిదారులకు అవగాహనా సదస్సు.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ విద్యాదరావు అధ్యక్షతనా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల దళిత బంధు లబ్దిదారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గ దళిత బందు స్పెషలాఫీసర్ తేజవత్ సీతారాం నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్పెషలాఫీసర్ తేజవత్ సీతారాం నాయక్ మాట్లాడుతూ దళిత బంధు లబ్దికి సెలెక్ట్ కాబడిన దళిత లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపి, వారు పెట్టుకున్నా యూనిటీ ఏదైతే వుంది దాన్నికి న్యాయం చేకూరే విదంగా అభివృద్ధి కావాలని, ఎవరు స్కీమ్ నిర్వర్యం చెయ్యకూడదు అని మీరు ఏదైతే యూనిట్లు పెట్టుకున్నారు అవి చేయడానికి కుదరకపోతే ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉందని తెలియపరిచారు. అదేవిధంగా లబ్ధిదారులు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఆదాయాన్నిచ్చే పరికరాలు గాని ఏదైనా బిజినెస్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అని ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత బంధు డబ్బులు తోటి ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమానికి వినియోగించడానికి అవకాశం ఉండదని మీ అకౌంట్లో వచ్చేయి దళిత బందు డబ్బులు మీరు ఏదైతే వ్యాపారం గాని తీసుకునే వస్తువు గాని ఇష్ట మిషన్ లెటర్ ద్వారా మా యొక్క డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుందనీ, అది కూడా వస్తువులు తీసుకోవడానికి డెవలప్ కావడానికి ఉపయోగపడే వాటికి అమౌంట్ పంపించడం జరుగుతుందని తమకు తాముగా అమౌంట్ తీసుకోవడానికి కుదరదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారులు పెట్టుకున్న యూనిట్లో గురించి ఒక్కొక్క ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ దళిత బండి తీసుకున్న లబ్ధిదారులు రెగ్యులర్గా ఇక్కడ ఉండే వ్యాపారాలు వర్కు సంబంధించినవి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా డెవలప్మెంట్ కావడానికి ఆలోచన చేసి సరైన యూనిట్ ని ఎంచుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు. అశ్వరావుపేట తాహాసిల్దార్ మాట్లాడుతూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు వారు సక్రమంగా ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని డెవలప్మెంట్ అయ్యి ఈ యొక్క పథకాన్ని బ్రతికించి తర్వాత మరికొంత మంది లబ్ధిదారులను ఇందులో చేకూరే విధంగా డెవలప్మెంట్ అవ్వాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత దమ్మపేట కోఆర్డినేటర్ వి అంజి బాబు మాట్లాడుతూ ఆర్థిక క్రమశిక్షణ తో ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని బ్యాంకుకు సంబంధించిన అనేక స్కీమ్స్ గురించి తెలియపరచి, అదేవిధంగా ఆర్థిక సైబర్ క్రైమ్ లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎంపీడీవో మరియు దళిత బందు లబ్ది దారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: