మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం నందు అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గుప్త ప్రసాద్,భువనేశ్వరి దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార నుంచి మంజూరైన రూ.1 లక్ష రూపాయల నగదును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, స్థానిక సర్పంచ్ బచ్చల.భారతి, సొసైటీ వైస్ చైర్మన్ దొందేటి రామ్మోహనరావు, సొసైటీ డైరెక్టర్లు,పార్టీ మండల అధ్యక్షులు,కార్యదర్శులు,నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: