CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులు చదువులో రాణించాలి.అంతర్జాతీయంగా పోటితట్టుకోవాలి అంటే ఇంగ్లీష్ మాధ్యమం అనివార్యం.

Share it:

 



  •  అన్నీ రంగాలలో తెలంగాణ అగ్రగామి 
  • తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య రంగాలకు పెద్దపీట
  • ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో రూ 1000 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రులు
  • ప్రయోజనకారి జీవో నెంబర్ 317 ని ఎందుకు రద్దు చేయాలి?
  • నూతన జోనల్ వ్యవస్థతో కొలువులు
  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా నిధులు ఇవ్వడం లేదు
  • మణుగూరులో ప్రభుత్వ డిగ్రీ,జూనియర్ కళాశాలలో DMF నిధుల నుండి 200 లక్షల రూపాయలు తో అభివృద్ధి పనులు ప్రారంభించిన ,పినపాక ఎమ్మెల్యే ,విప్ రేగా కాంతారావు

మన్యం మనుగడ ప్రతినిధి,మణుగూరు: విద్యార్థులు చదువులో రాణించాలి అని పినపాక ఎమ్మెల్యే,విప్ , భద్రాద్రి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ,జూనియర్ కళాశాలలోరూ.200 లక్షల DMF నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయంగా విద్యార్థులు పోటీ తత్వం తత్త్వం తట్టుకోవాలంటే ఇంగ్లీష్ విద్య అనివార్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 8 వేల కోట్లు వెచ్చించి అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి నిధులు ఇవ్వకున్నా దేశంలో అభివృద్ధిలో అన్ని రంగాలలో దూసుకుపోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్య ,వైద్యం కు పెద్ద పీట వేయడం జరుగుతుంది అని, ఈ నేపథ్యంలోనే విద్య వైద్య రంగాలకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది అన్నారు.

*జీవో నెంబర్ 317 పై రాద్ధాంతం తగదు*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ప్రయోజనకారిగా ఉండాలనే సంకల్పంతో జీవో నెంబర్ 317 తీసుకురావడం జరిగిందన్నారు. కేవలం కొంతమంది ఉద్యోగులు దురుద్దేశంతో వారికి స్థానభ్రంశం కలుగుతుందని భావించి జీవో నెంబర్ 317 పై అసత్య ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ఈ జీవో మూలంగా గా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలు ఉండే ఆస్కారం ఉండదన్నారు. తద్వారా ప్రజలకి మెరుగైన పాలన అందించవచ్చని రేగా అన్నారు.

*కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగ నోటిఫికేషన్ లకి ఆలస్యం*

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి మేలు జరగాలి అనే సంకల్పంతో నూతన జోనల్ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. వారి ఆమోదం లో జాప్యం చేయడం మూలంగా ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఆలస్యం జరిగిందని త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విప్ రేగా కాంతారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయకుమారి,మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ.శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, సర్పంచ్ ఏనిక.ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామి రెడ్డి,నవీన్,

 నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, కార్యదర్శి బోశెట్టి.నవీన్, మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,టౌన్ అధ్యక్షులు రుద్ర వెంకట్ సెక్రెటరీ గుర్రం. సృజన్,టీఆరెస్ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యంపాటి సందీప్ రెడ్డి, మణుగూరు సోషల్ మీడియా అధ్యక్షులు సురేందర్ పటేల్, మరోజు రమేష్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: