CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పాపకొల్లు అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట..

Share it:

 


  • విచారణ కోసం వెళ్లిన అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల తిరుగుబాటు..
  •  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు చేతికి గాయం..! స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..


మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధి లోని పాపకొల్లు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను కొంతమంది వేటగాళ్లు వేటాడి చంపి తింటున్నార అన్న విశ్వసనీయ సమాచారం అందడంతో సోమవారం ఉదయం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ రావు తమ సిబ్బందితో అటవీ సమీప గ్రామమైన ఫుల్లుడు తండా చేరుకొని అనుమానిత ఇండ్లలో సోదాలు నిర్వహిస్తుండగా లావుడ్యా వినోద్ అనే వ్యక్తి తన ఇంటిలో వండిన కూర పాత్రను తీసుకొని పారిపోతుండగా అతనిని అటవీశాఖ అధికారి ప్రసాద్ రావు యంబడించి పట్టుకొని విచారిస్తుండగా గ్రామస్తులంతా తిరగబడి పట్టుకున్న వ్యక్తిని విడిపిస్తున్న క్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి చేతికి గాయం కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ పరిసర ప్రాంతంలో అడవి జంతువుల వేట ప్రతి సంవత్సరం కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్న ఎలాంటి భయం లేకుండా వన్యప్రాణులను చంపి వాటి మాంసాన్ని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అడవి జంతువులను వేటాడే వేటగాళ్ల ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share it:

TS

Post A Comment: