CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్.పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం భరోసా.

Share it:

 


మన్యం మనుగడ, బూర్గంపాడు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు 

 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని తాసిల్దార్ కార్యాలయం నందు ఎమ్మార్వో భగవాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,108 మంది లబ్ధిదారులకు రూ 1,08,12528/- ప్రజా ప్రతినిధులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బందు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ పేదలకోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు.

 గత ప్రభుత్వాలు ఆడపిల్లలు పెళ్లిళ్లు కోసం ఆలోచించలేదని, ఆడపిల్లలు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారం ఉండేదని, అన్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటు వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళల రక్షణ కోసం ఫి టీమ్స్, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యం కోసం, ఆరోగ్య కళ్యాణ లక్ష్మి పథకం బాలింతల చిన్నారుల కోసం కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు అని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణా రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్క సాని శ్రీను, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు,బూర్గంపాడు మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: