CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాకకు రూ.3 కోట్ల 68 లక్షలు మంజూరు - ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపన టీఆర్‌ఎస్‌ మండల కమిటీ.

Share it:

 



- జానంపేట-అమరారం బీటీ రోడ్డు మంజూరు 

- పినపాక-మారేడుగూడెం రోడ్డుకు నిధుల మంజూరు 

- 24 సీసీ రోడ్లు మంజూరు 

- పాఠశాలల మరమ్మత్తులకు రూ. 68 లక్షలు 


మన్యం మనుగడ,పినపాక : 

పినపాక మండలానికి ప్రభుత్వం నుండి పలు అభివృద్ది పనుల కోసం 3 కోట్ల 68 లక్షలు మంజూరు అయ్యాయని, నిధులు విడుదల చేయించిన తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారికి టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ... జానంపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు నుండి అమరారం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 1 కోటి 58 లక్షలు నిధులు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా మండల కేంద్రమైన పినపాక నుండి మారేడుగూడెం గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. 

అదేవిధంగా 23 గ్రామ పంచాయితీలకు గాను 24 సీసీ రోడ్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ సీసీ రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం నుండి రూ. 1 కోటి 20 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. వీటితో పాటు మండల పరిషత్‌ నిధుల నుండి సీసీ రోడ్లకు, అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాల మరమ్మత్తులకు రూ.68 లక్షల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పినపాక మండలంలో గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారికి టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కటకం గణేష్‌, అధికార ప్రతినిధి రాయల సత్యనారాయణ, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మొగిలిపల్లి నర్సింహారావు, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, టీఆర్‌ఎస్‌ పార్టీ ఎస్టీ కమిటీ అధ్యక్షులు గొంది నాగభూషణం, సర్పంచ్‌లు బాడిశ మహేష్‌,కలివేటి సునీల్‌,కొర్సా కృష్ణంరాజు,పి. సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: