CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా కు శాస్త్రీయ పరిష్కారం చూపి తక్షణమే విద్యాసంస్థలను ప్రారంభించాలి:PDSU డిమాండ్ ..

Share it:

 



మన్యం మనుగడ వెబ్ డెస్క్:


కేసీఆర్ ప్రభుత్వం కరోనా సాకుతో విద్యాసంస్థలను మూసివేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని,కరోనాకు ఒక శాస్త్రీయ పరిష్కారం చూపి విద్యాసంస్థలను తక్షణమే ప్రారంభించాలని పి డి ఎస్ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ అన్నారు. పి డి ఎస్ యు ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంక్రాంతి పండుగ పేరుతో సెలవును ప్రకటించి నేడు కరోనా కేసులు పెరుగుతున్నాయని వాటిని నియంత్రించేందుకు జనవరి 30 వరకు విద్యాసంస్థలు బంద్ ప్రకటించడం లో కుట్ర కోణం దాగి ఉందని వారు అన్నారు. ప్రపంచం లో కరోనా కేసులు పెరిగిన దేశాలు అనేకం ఉన్నాయని అయినా అక్కడ విద్యాసంస్థలు బంద్ చేయలేదు.భారతదేశంలో ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి.కానీ ఒక్క తెలంగాణలో మాత్రమే ఎందుకు ముందస్తుగా బడులు మూసి వేసే ప్రక్రియ ప్రారంభించారని వారు ప్రశ్నించారు. తెలంగాణలో సంక్రాంతి సెలవుల కంటే ముందే ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడం కోసం జీవో నెంబర్ 317 తీసుకొచ్చి అసంబద్దంగా ఉపాధ్యాయుల స్థానచలనం జరుగుతుందని దీనిని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉపాధ్యాయులు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే బడులు మూసివేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యారంగాన్ని ముందుకు నడిపించేందుకు బడ్జెట్ కేటాయింపుల బాధ్యత నుండి వైదొలుగోచ్చు అనే బాధ్యతారాహిత్యానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతుందని వారు అన్నారు. తక్షణమే కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యాసంస్థలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు కొత్తగూడెం డివిజన్ నాయకులు నరేందర్ ఇల్లందు పట్టణ నాయకులు గుమ్మడి రవీనా,ఎ.పార్థసారథి,బి.సాయి,కాంపాటి శశి కుమార్,గంగాధరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: