CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి మరియు ఇంచార్జి ఫోక్సో జడ్జి మొహమ్మద్ అబ్దుల్ రఫీ మంగళవారం తీర్పు చెప్పారు. పినపాక మండలం పోట్లపల్లి కి చెందిన గాడిద లక్ష్మి తన తమ్ముడు రఘు రెండవ కూతురు ప్రవళిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతూ తన వద్దే ఉంటుందని 2016 ఆగస్టు 8న రాత్రి భోజనానంతరం నిద్రించుచుండగా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేసరికి తన కోడలు ప్రవళిక కనిపించలేదు. తన తమ్ముడు ప్రభాకర్ తన బాబాయ్ చుట్టుపక్కల వెతికే సరికి పొట్లపల్లి పెద్ద వాగు వద్ద కు వెళ్లేసరికి గట్టిగా కేకలు వినిపించగా ప్రవళిక ఏడుస్తూ కనపడగా ఏం జరిగిందని అడగగా ఒక వ్యక్తి వచ్చి తన ఇక్కడ పడుకోబెట్టినారని గట్టిగా కేకలు చెప్పినది. అంతకు ముందు రోజు రాత్రి దొడ్లో ఉన్న గొర్రెపోతు దొంగిలించుట ఒక గొర్రె పోతును దొంగిలించుకుని తోలెం రామకృష్ణ (అదే గ్రామానికి చెందిన) వెళుతుండగా వారిద్దరూ పట్టుకొని పారిపోయాడని తనపై అనుమానం ఉండదని బయ్యారం పోలీసు వారికి ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ ఇ.రతీష్ కేసు నమోదు చేసుకొనగా, దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 17 మంది సాక్షుల విచారణ అనంతరం తోలెం రామకృష్ణ పై నేరం రుజువైనదని కోర్టు భావించి భారత శిక్షాస్మృతి 363 ప్రకారము మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మూడు వేల రూపాయల జరిమానా సెక్షన్ 12 పోక్సో యాక్ట్ ప్రకారం రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష రెండు వేల రూపాయల జరిమానా మొత్తంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. వి. డి. లక్ష్మి వాదించారు.లైజాన్ ఆఫీసర్లు ఎం వీరబాబు,కోర్ట్ కానిస్టేబుల్ రామగాని కోటేశ్వరరావు సహకరించారు.

Share it:

TS

Post A Comment: