CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఒమిక్రాన్ గురుంచి చిట్టితల్లి సేవసమితి ప్రచార రధం ద్వారా ప్రచారం చేస్తూ మాస్కులు పంపిణీ.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో చిట్టితల్లి సేవాసమితి వ్యవస్థాపకులు మనుగొండ వెంకట ముత్యం ఆదేశానుసారం చిట్టితల్లి ప్రచారరథం ద్వారా మండలంలోని ప్రజలకు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు చిట్టితల్లి సేవా సమితి మరియు చిట్టితల్లి ఆంబులెన్స్ వారి విజ్ఞప్తి అంటూ కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ మన రాష్ట్రం లోకి ప్రవేశించిన నేపథ్యంలో మనమందరం అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించవలెను, భౌతిక దూరం పాటించవలెను, తరచూ మీ చేతులను సబ్బుతో గాని శానిటైజర్ తో గాని శుభ్ర పరుచుకోగలరు, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలెను మరియు 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేయించుకోవలెను, ఎవరికైనా నడుమునొప్పి, రాత్రిపూట చెమటలు, నీళ్ళ విరోచనాలు, తీవ్రమైన అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు గరగర, వంటి లక్షణాలు ఉంటే వెంటనే మీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా మరియు ఓమిక్రాన్ పరీక్షలు చేయించుకోగలరు, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించే మిమ్మలను మీ కుటుంబాలను కరోనా మరియు ఓమిక్రాన్ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు అని ప్రచారం చేస్తూ కరోనా ఓమిక్రాన్ పై అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆంబులెన్స్ బాజీ, చందు, ఇమ్ము, శేఖర్, కోలా రాము సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: