CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ మీద దాడి అప్రజాస్వామికం.రాష్ట్రంలో తెరాస ఉనికి కోల్పోతున్నామనే భయం తోనే దాడులకు పాల్పడుతున్నారు.

Share it:


ఏటూరునాగారం నుండి బూర్గంపహాడ్ వెళ్లే రహదారి పై రాస్తారోకో నిర్వహించిన భాజపా శ్రేణులు

మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు యరంగారి వీరన్ కుమార్ అధ్వర్యంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద దాడిని ఖండిస్తూ రాస్తారోకో(నిరసన) నిర్వహించడం జరిగింది.

బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని ఖండిస్తూ బిజెపి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మరియు బూర్గంపాడు వెళ్లే రహదారి పైన ప్లకార్డులు మరియు నలుపు బ్యాడ్జీలతో రాస్తారోకో ( నిరసన) చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడిపై దాడి చేయడం అప్రజాస్వామికం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కనబెట్టి బిజెపి నాయకులు చేసే అభివృద్ధి పనులు అడ్డుకుంటూ టిఆర్ఎస్ కార్యకర్తలతో దాడులు చేయించడం వారి దివాలాకోరు తనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలతో టిఆర్ఎస్ ప్రాబల్యం తగ్గి, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ఉనికి కోల్పోతామనే ఒక అభద్రతాభావంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి పరిపాలించడం, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం చాలా బాధాకరం అన్నారు. మీరు ప్రతిపక్ష నాయకులపై చేయించే దాడులను ప్రజలు గమనిస్తున్నమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిట్యాల రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంధసిరి శ్రీనివాస్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి రావుల జానకి రావు, మండల సీనియర్ నాయకులు పల్నాటి సతీష్, బట్ట రాములు, మహిళా సీనియర్ నాయకులు గోమాసు సావిత్రి, ఈస్టర్రాణి, నరసింహ సాగర్ (శనిగాకుంట) బూత్ అధ్యక్షులు తాటి నాగరాజు, కత్తి గూడెం బూత్ అధ్యక్షులు మండల సంతోష్ కుమార్, తిమ్మంపేట మాజీ బూత్ అధ్యక్షులు సల్లూరి రాజేందర్, మల్లయ్య, చిట్యాల మహేష్, అర్జున్ రావు, ఎం. నారాయణ, మురళి, నవీన్ కుమార్, రాజు ప్రజా, డి.వంశీ, పి. రంజిత్, జి. నరసింహారావు మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: