CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లాకు శ్రీ సమ్మక్క-సారలమ్మ పేరును నామకరణం చెయ్యాలి.ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్.

Share it:


మన్యం మనుగడ ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయకపోడ్ గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కు శ్రీ సమ్మక్క -సారలమ్మ జిల్లాగా నామ కరణం చెయ్యాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ మాట్లాడుతూ.కొట్లాడిన ఉద్యమ పోరాటమే ఫలితంగా ములుగు జిల్లాని తెచ్చుకున్నాం అని అన్నారు తెలంగాణా ఉద్యమ సమయంలో 2013 నవంబర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కేసిర్ ములుగు జిల్లాను సమ్మక్క - సారలమ్మ గా నామకరణం చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కూడా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు అనిఅన్నాడు.

ములుగు జిల్లా అంటే ఆదివాసుల సాంసృతి సంప్రదాయాలకు నిలువెత్తు శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మా జాతర ఇటువంటి సంప్రదాయాలు కలిగిన ములుగు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందే తప్ప సమ్మక్క -సారలమ్మలను అమ్మలగా చూడటం లేదు అని అన్నారు . ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ నామకరణం చేయడం యెడల ఆదివాసీ సంఘాలనుండి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జిల్లాకమిటి ముంజల బిక్షపతి,ఆదివాసీ నాయకపోడ్ కులస్తులు కొత్త సదయ్య,ఆకుల మొగిలి, అరిగెల సంజీవ,ఆకుల సమ్మక్క,చిర్ర సుభద్ర,కొత్త నిర్మల,చిర్ర సుభద్ర,చిర్ర రాణి, చిర్ర రాజా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: