CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేడారం జాతరలో ఆదివాసీలను,స్థానికులను ఆదుకోండి.కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు సోమవారం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఆలం కిషోర్ లు వినతి పత్రం అందజేశారు.అనంతరం మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.ప్రతి ఏటా జాతరలో స్థానిక ఆదివాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని,జాతర సమయంలో రెండో పంటను కోల్పోవడం జరుగు తుందని,అదేవిధంగా జాతర అనంతరం అనారోగ్య పాలు అవ్వడం లాంటి సమస్యలతో ప్రతి ఏటా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశంలో స్థానిక ఆదివాసీలను వ్యాపార రంగంలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ కు విన్నవించగా కలెక్టర్ ఒప్పుకున్నారని,ప్రణాళిక ప్రకారం జాబితాను అందించమని కలెక్టర్ సూచన మేరకు వివిధ రకాల వ్యాపారాలు చేసి ఆదివాసీలు 74 మందిని గుర్తించినట్లు కలెక్టర్ కు వివరించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం భవిష్యత్తులో వ్యాపార హక్కులు ఆదివాసులు కలిగి ఉండే విధంగా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరారు. ఆదివాసీలను వ్యాపార రంగంలో అభివృద్ధి లోకి రావాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బ్యాంకు నుండి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.జాతర సమయంలో విద్యుత్ శాఖ అధికారులు వేలకు వేలు వ్యాపారస్తులు దగ్గరనుండి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిని నియంత్రించాలని అన్నారు. అన్ని రకాలుగా ఆదివాసులను ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు అరుణ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాష్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: