CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆధునిక భారత మాత సావిత్రిబాయి పూలే కి భారతరత్న ప్రకటించాలి.బషీర్బాగ్ లా కాలేజీ సభలో డాక్టర్ కొండ నాగేశ్వర్ ఉద్ఘాటన.

Share it:

  


 



బషీర్బాగ్ లా కాలేజ్ విద్యార్థులకు సావిత్రిబాయి పూలే 191 వ జయంతి సందర్భంగాఅవగాహన సదస్సుప్రారంభ కార్యక్రమం లా కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ గుమ్మడి అనురాధఅధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా OUCIS డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ హాజరై ప్రసంగించారు.వారు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో భారతీయ సమాజం అసమానత్వం ,అణిచివేత, కుల వివక్షతకు నిలయంగా ఉన్న కాలంలో జ్యోతిబాపూలే మరియు సావిత్రిబాయి పూలే బడుగు జనం కోసం విశేష కృషి చేశారన్నారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను లెక్కచేయకుండా సావిత్రిబాయి పూలే అనగారిన వర్గాలకు విద్య నేర్పి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా నిలిచిపోయారు అన్నారు. ఆసమానత్వపు సమాజంలో సమానత్వపు మానవతా విలువలు కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు .ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా విద్యాలయాన్ని స్థాపించి, భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు లా కాలేజీ ప్రిన్సిపల్ గుమ్మడి అనురాధ తో కలిసి *అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.* కార్యక్రమంలో బషీర్ బాగ్ లా కాలేజ్ అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: