CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పిఆర్సి జీవో విడుదల చేసినందుకు స్వీట్లు పంపిణి చేసిన ఆశాలు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.


  మండలం లోని రమణక్కపేట బ్రాహ్మణపల్లి చుంచుపల్లి పీహెచ్సి ల పరిధిలో ని ఆశాల సమావేశం రమాదేవి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అధితిగా ఆశా యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు మడే రవి హాజరై మాట్లాడుతూ సమయంతో సందర్బంలేకుండా నిరంతరం ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తున్నా ఆశాలకు పారితోషికాల జీవో 167.75. లను వెంటనే రద్దు చేసి పిక్స్డ్ వేతనం జీవో వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలు పాలించే ప్రజా ప్రతినిధులకు ఎటువంటి రిపోర్ట్ లేకుండా గౌరవ వేతనాలు పిఆర్సి వేస్తున్నా ప్రభుత్వం నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా లకు మాత్రం పనిని బట్టి పారితోషికాలు వేయడం అదికూడా మంత్లీ రిపోర్ట్ వేస్తేనే ప్రభుత్వం వారిఖాతాలో వేయడం సమంజసం కాదని అన్నారు. తక్షణమే పిక్ష్డ్ వేతనం వేయాలని కనీస వేతనాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు. పీహెచ్ సి బస్సు పసులు ఇవ్వాలని ఏఎన్ఎం పోస్టులో మొదటి ప్రియర్టీ ఇవ్వాలని అన్నారు.కేంద్రం ఇచ్చిన కరోనా ఇన్సెంటివ్ 16 నెలల డబ్బులు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఆశాల సమస్యల పరిష్కారం కొరకు ఆశాలు నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిబ్రవరి 3 ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలనీ ఆశాలకు పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమం లో ఆశాలు నాగమణి లలిత శ్రీలత రమాదేవి నాగమణి సాంబలక్ష్మి శ్రావ్య వెంకటలక్ష్మి, సుజాత నళిని రాణి విజయకుమారి సులోశణ సంభాలక్ష్మి వజ్ర జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: