CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చర్ల ఎం ఈ ఓ ఆఫీస్ లో జరిగిన మార్క్స్ టాంపరింగ్ పై అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి TSUTF.

Share it:

 


మన్యం టీవీ చర్ల:


2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవో 317 ద్వారా ఉద్యోగ,ఉపాధ్యాయులకు నూతన జిల్లాల కేటాయింపులో భాగంగా చర్ల మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు తయారీలో మరియు ఉపాధ్యాయుల నుండీ వచ్చిన అప్పీల్స్ ను సరిచేయించడంలో ఎంఈఓ వైఫల్యం కారణంగా కొందరు సీనియర్లు సీనియారిటీ కోల్పోయారు,అలాగే 2017 టిఆర్టిలో వచ్చిన ఇద్దరు ఉపాద్యాయుల మార్క్స్ తప్పుగా నమోదు కావడం వల్ల వారు ములుగు జిల్లాకు కేటాయించబడ్డారు. వీరి కంటే తక్కువ మార్క్స్ ఉన్నవారు కూడా భద్రాద్రికి కేటాయించ బడటం జరిగింది. ఈ మార్కుల నమోదులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ మార్కుల టాంపరింగుకు పాల్పడిన వారిని, దానికి సహకరించిన వారినీ కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

చర్లమండల విద్యాశాఖాధికారి చంద్రుగొండ మండలంలో పనిచేస్తూ చర్లకు ఇంచార్జి ఎం ఈ ఓగా విధులు నిర్వహిస్తున్నారు. చర్లకు చంద్రుగొండకు 120km దూరం కనీసం వారానికి ఒకసారి అయినా మండలానికి రావడం లేదు. దీని వల్ల పాఠశాలల పర్యవేక్షణ లేకుండా పోయింది. మండలానికి ఉపాధ్యాయుల కేటాయింపులో కూడ కొన్ని పాఠశాలలకు అన్యాయం జరిగింది.

ఎం ఈ ఓ అందుబాటులో లేని కారణంగానే ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని TSUTF మండల కమిటీ అభిప్రాయ పడుతున్నది.

డి ఈ ఓ వారిని చర్ల MEO మార్చడం గురించీ పలుమార్లు కోరిన ఇంతవరకు మార్చడం జరగలేదు.కావున అధికారులు ఇకనైనా అందుబాటులో ఉండే విద్యాధికారి నీ నియమించాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్అధ్యక్షులు,ప్రధానకార్యదర్శి కే. రాంబాబు, వి. బాలకృష్ణ, కె. జయలక్ష్మిపాల్గోన్నారు.

Share it:

TS

Post A Comment: