CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కిన్నెరా కళ్యాణమండపం లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిస్టమస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని తహసిల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, ముందుగా క్రైస్తవులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.భారతదేశం అనేక మతాలు,కులాలు, సంస్కృతి,సంప్రదాయాలు,భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత,సీఎం కేసీఆర్ పరిపాలనలో అన్ని మతాలు, అన్ని కులాల వారిని సమానంగా చూస్తున్నారని, వారి వారి పండుగలకు,వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతి సంవత్సరం వారికి కానుకలు అందజేయడం జరుగుతోందన్నారు.అందులో భాగంగా క్రిస్టమస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందజేస్తున్న బహుమతులను నా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆ యేసు ప్రభు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం లోనే ఆదర్శంగా నిలవాలని,అలాగే భారతదేశం ప్రపంచ దేశంలోనే అత్యంత సంపన్న దేశంగా ఎదగాలని ఆయన కోరారు.క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ క్రిస్టమస్ పండుగను వారి వారి కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలి అన్నారు.ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు మాట్లాడుతూ ప్రార్థనలు జరుపుకోవడానికి ఒక కమిటీ హాల్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించవలసిందిగా విప్ రేగా కాంతారావు ను కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు స్థలం తో పాటు,కమిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పాస్టర్లు మరియు వారి బృందం విప్ రేగా కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం విప్ రేగా కాంతారావు కేక్ కట్ చేసి అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్టమస్ కానుకలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం. నరసింహారావు,తహసీల్దార్ చంద్రశేఖర్,పిఎసిఎస్ చైర్మన్, కుర్రి.నాగేశ్వరరావు,ఎంపీటీసీల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,ఎంపీటీసీలు రమ్య,సమ్మక్క, బాబురావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచుల సంఘం అధ్యక్షులు ఏనిక. ప్రసాద్,సర్పంచులు జంపేశ్వరి, రజిత,పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు,కార్యదర్శి రాం రెడ్డి,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు, వట్టం.రాంబాబు,మేకల రవి,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: