CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట.

Share it:



 న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి......



     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల అడుగుల కు మడుగులొత్తుతూ వరి ధాన్యం కొనుగోలు పై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దోబూచులాడుతున్నారని రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు. శుక్రవారం బూర్గంపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మోర రవి మాట్లాడుతూ. రైతులు ఆరుగాలం చెమటను చిందించి కష్టించి సాగు చేసిన పంట చేతికి వచ్చిన సమయంలో ప్రభుత్వాల దోబూచులాట మరోపక్క ప్రతికూల వాతావరణం వెరసి పంటను కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కళ్ళoలో ఆరబోసిన తర్వాత తేమ శాతం పేరుతో మరో పేరుతో రకరకాల మెలికలు పెడుతూ కాలయాపన చేస్తున్నారని దాంతో రైతులు పొలం



లో పంట పండించడానికి శ్రమించిన దానికంటే ధాన్యం అమ్మడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో జాప్యం వల్ల రైతులు అప్పటివరకు పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా వ్యవసాయ పెట్టుబడితో పోల్చుకుంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం తో పాటు , తరుగు పేరుతో 5 నుండి 10 కిలోలు తీయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించిన విధంగా ఉన్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వాలుదానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో భూముల స్వభావాన్ని బట్టి, ఏ పంటలు వేయాలో సరైన ప్రణాళికలు, ప్రోత్సాహకాలు ప్రకటించకుండా నోటి మాటలతో చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు రైతాంగం విషయానికి వస్తే పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా రకరకాల పేరుతో కాలయాపన చేయకుండా వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కు కొనుగోలు చేసి ధాన్యాన్ని సకాలంలో కల్లాల నుండి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ , యారం శ్రీనివాస రెడ్డి, రామ , పొనగంటి వెంకన్న,, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: