CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిర్చి పంట కు వచ్చిన వైరస్ ని ప్రకృతి విపత్తు గా ప్రకటించి మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి -తెలంగాణ రైతు సంఘం.

Share it:



మన్యం టీవీ చర్ల:


ఈ సంవత్సరం తామర వైరస్ 

వల్ల మిర్చి పంట కు తీవ్రమైన నష్టం వాటిల్లిందని దీనికి ప్రభుత్వం భాధ్యత వహించి ప్రకృతి విపత్తు గా ప్రకటించి నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం (AIKS) డిమాండ్ చేసింది.

శుక్రవారం తెలంగాణ రైతుసంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి బృందం చర్ల మండలం లో మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తామర ,నల్లనల్లి, ఎర్రనల్లి వంటి వైరస్ నుండి కాపాడటానికి 40 నుంచి 60 సార్లు మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు అన్నారు. ఇప్పటికీ మిర్చి పంట కి రైతులు ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని, చేతికి క వచ్చిన బుగ్గి పాలు అయిందని వారు పేర్కొన్నారు. వైరస్ లను అరికట్టటానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు

వేలాది మంది రైతులు లక్షల ఎకరాలు మిర్చి పంట వేస్తే వైరస్ వలన పంట నాశనం అవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు ఉందని వారు అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా దీనిని ప్రకృతి విపత్తు గా పరిగణించి ప్రకటించాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను తయారు చేసేందుకు ఈ సర్వేలు జరపాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రుణమాఫీ పూర్తి కాకుండా కొత్త రుణాలు ఇవ్వకుండా ఉండటంతో బయట ప్రైవేటు అప్పులు తీసుకునీ పంటలు వేశారని ఈ వైరస్ దెబ్బకి రైతులు కుదేలుఅయ్యారని దీనితో ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీని పై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 27న ఉదయం పది గంటలకి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాలో నష్టపోయిన రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము

మిర్చి తోటలను పరిశీలించిన ప్రతినిధి బృందంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు. కాసాని ఐలయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచిలి రవి కుమార్ ధర్నా జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ మండల కార్యదర్శి మురళి జిల్లా కమిటీ సభ్యులు బొల్లి సూర్య చందర్ రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: