CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

_మిర్చి లో తామర పురుగు నివారణకు రైతులు మెలకువలు పాటించాలి_జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం ఏ అక్బర్.....

Share it:





  •  జనవరి మొదటి వారంలో ఏటూరు నాగారంలో మిర్చి రైతులకు రీజనల్ సెమినార్ 
  •  జాతీయ మిర్చి కామర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి


మిర్చి సాగులో తామర పురుగు సమస్య రైతులను ఆర్థికంగా కుంగదీస్తోందనీ ఈ సమయంలో మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈ సమయంలో రైతులు పలు మెలకువలు సాగు సూచనలు పాటించాలని ములుగు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం ఎ అక్బర్ అన్నారు సోమ వారం మండలంలోని కత్తి గూడెం అకినేపల్లి మల్లారం దుగినేపల్లి తదితర జిల్లా సరిహద్దు గ్రామాల్లో మిర్చి తోట పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు తామర పురుగు నివారణకు ఎకరాకు 30 బులుగు జిగురు అట్టలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఢిలిగేట్ మందు లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల మందు మరియు నీమాఇల్ 10000 పిపియం లీటరు నీటికి మూడు మిల్లీ లీటర్లు కలిపి ఎకరాకు 12 నుండి 15 ట్యాంకులు పిచికారి చేసుకోవాలని సూచించారు బయో మందులను ఎట్టి పరిస్థితుల్లో మిర్చి పంటపై వినియోగించరాదని రైతులు తెలిపారు తామర పురుగు సమస్య తీవ్రంగా ఉన్నందున పంట దిగుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఈ పరిస్థితులలో ఇప్పటికే చెట్టుపై ఉన్న కాయలు జాగ్రత్త చేసుకోవాలే తప్ప కొత్తగా పూత కాపు వస్తుందనే నమ్మకంతో అనవసర మందులు పిచికారి చేసి అప్పులపాలు కావద్దని రైతులకు సూచించారు ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కామర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ జనవరి మొదటి పక్షంలో ఏటూరునాగారం కేంద్రంగా ఆరు మండలాల నుంచిమిర్చీ రైతులకు కలిపి స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఉద్యాన మరియు వ్యవసాయ శాఖ సహకారంతో మిర్చి రైతులకు రీజనల్ సెమినార్ ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని రైతులకు స్టాల్స్ ఏర్పాటు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ అవకాశాన్ని గోదావరి పరివాహక ప్రాంత మిర్చి రైతాంగం వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అకినేపల్లి మల్లారం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మదర్ సాహెబ్ రైతులు గాలి శివాజీ ధూళిపాళ్ళ మురళీ మైసూరారెడ్డి చిన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: