CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దిల్లీలో రేపటి నుంచి పాఠశాలలు మూసివేత.వాయు కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో నిర్ణయం.

Share it:

 


దిల్లీ: వాయు కాలుష్య సంక్షోభంలో చిక్కుకున్న దిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో వాటిని తిరిగి తెరవడంపై ఈ రోజు దిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు’ అంటూ మందలించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


‘గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని మేం పాఠశాలలు తెరిచాం. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’ అని మంత్రి వెల్లడించారు. ఈ కాలుష్య పరిస్థితుల కారణంగా పది రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలు సోమవారం నుంచే నడుస్తున్నాయి. ఇప్పుడు వాటికి మళ్లీ బ్రేక్ పడింది.

Share it:

TS

Post A Comment: