CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేయాలి:మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: 


తెలంగాణ రాష్ట్రంలోని వెనుక బడిన ముస్లిం వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి యాకూబ్ పాషా కోరారు.ఈ మేరకు బుధవారం మణుగూరులో మిల్లత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై యాకూబ్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్టంలోని ముస్లింలకు విద్యా, ఉపాధి రంగాల్లో 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉన్నప్పటికీ ఈ ముస్లిం వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్ లేనందున కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు,కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పొందే అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే బీసీ జాబితాల్లో గల కొన్ని కులాలను ఓబీసీ జాబితాల్లో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ కు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి పాదనను పరిగణలోకి తీసుకున్న జాతీయ బీసీ కమిషన్,ఈ నెల 22 నుంచి 24 వరకు ఢిల్లీలో బీసీ కులాల ఎంపిక విధానం పై పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ కేంద్ర మంత్రికి నివేదిక అందజెయ్యనుందని,ఈ విచారణకు కుల సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో హాజరై, వారి జీవన విదానాల స్థితి గతుల ఆధారాలతొ జాతీయ బీసీ కమిషన్ కు సమర్పిస్తే, వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలింస్తుందని కావున ఈ నెల 24 లోపు రాష్ట్ర వ్యాప్తంగా గల ముస్లిం బిసి-ఈ వర్గాలకు చెందిన 40 ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చుటకు గాను ఈ నెల 24 వ తేదీ లోపు ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయం లో,లేదా యన్ సీబిసి.యంఇయం 1@ జిమెయిల్.కం కు మెయిల్ ద్వారా నైనా సమర్పించాలని సూచించారు.ఓబీసీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఈ కులాలను చేర్చినట్లైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పొందే అవకాశాలు ఉంటాయని యాకూబ్ పాషా తెలిపారు. కావున ముస్లిం సంస్థలు,పలు మజీద్ కమిటీవారు తమ తమ విన్నపాలను సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలకు సమర్పించాలని కోరారు.ఈ సమావేశంలో మిల్లత్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్,వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్ షరీఫ్,ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ సిరాజ్ పాషా,ఉపాధ్యక్షులు మొహమ్మద్ నురోద్దిన్,మండల కో-ఆప్షన్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎస్కె ఖదిర్ పలు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: