CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మారుమూల ప్రాంతాల్లో జోరుగా మద్యం దందా. గుట్టుచప్పుడు కాకుండా కాస్ట్‌లీ సరుకులోనూ..

Share it:

 


  •  ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయాలు. 
  •  నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న ఎక్సైజ్‌శాఖ.


 మన్యం మనుగడ వాజేడు( డిసెంబర్ 24) ఒకటో పెగ్గు.. రెండో పెగ్గు దాకా ఓకే.. ఆ తర్వాత మందుబాబులు మత్తులోకి జారుకుంటారు. ఇక కొన్ని బెల్టుషాపుల నిర్వాహకులు కల్తీ మూత తీస్తారు. కాస్ట్‌లీ మందులో ‘చీప్’క్వాలిటీని కలిపేస్తారు. అది తాగిన మద్యం ప్రియులకు ఇంకాస్త కిక్కు ఎక్కుతుంది. మళ్లీ.. మళ్లీ అదే బెల్టుషాపులకు వచ్చి కాస్ట్‌లీ మందుకు డబ్బు చెల్లించి కల్తీ మద్యం తాగివెళ్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో మస్తుగా జరుగుతున్న ఈ కల్తీ మద్యం దందా.. పైన నిఘా పెట్టారు కానీ 20 రూపాయలకు దొరికే నాటుసారా పైన నిఘా పెడతారు కానీ ఎక్సైజ్ అధికారులు ఎందుకంటే వారికి ముడుపులు అందుతున్నాయి కాబట్టి, మండలకేంద్రంలో వాజేడు, లక్ష్మీపురం గ్రామాలలోని మద్యం షాపుల కైవసం చేసుకున్న మద్యం వ్యాపారి ఎక్సైజ్ అధికారులకు ముడుపులు ఎరగా చూపి ఏజెన్సీ చట్టాలను కాలరాస్తూ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకొని ఏజెన్సీ చట్టాలను కాలరాస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు వివిధ రాజకీయ పార్టీలలో మండల అధ్యక్షులు గిరిజనేతరులు ఉండడంతో మద్యం వ్యాపారులు అప్పజెప్పే ముడుపుల తలొగ్గి మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించాలని ఉన్నప్పటికీ అధిక అధికార ఆదేశాలు బేఖాతరు చేస్తూ మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యం కొనసాగిస్తున్నారని మండల వాసులు ఆరోపించారు. పీసా చట్టాన్ని పైసా తో ముడి వేసి గిరిజనేతర మద్యం వ్యాపారులు బినామీ గిరిజనులతో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అడిగేవారు లేక గత ఐదు సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగిస్తూ గిరిజనేతర వ్యక్తి అక్రమ వ్యాపారాలకు ఒడిగట్టి అధికారులను సైతం స్నేహపూరితంగా మక్కువ చేసుకొని అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు వెంకటాపురం మండలాలలో ఎవరైనా మద్యం వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే వారిని నయానో భయానో బెదిరించి తన దారిలోకి తెచ్చుకుని తన కనుసన్నల్లో వ్యాపారం కొనసాగించడం గమనార్హం ఇటు పోలీసు అధికారులు ఆటో ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఆయనకు వత్తాసు పలకడం మరోవైపు రాజకీయ పార్టీల నాయకులు ఆయన వైపు మొగ్గు చూపడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆయన ఎదురులేని శక్తిగా ఎదగడమే కాక ఏజెన్సీ ప్రాంత మద్యం డాన్ గా పేరు ప్రఖ్యాతులు పొంది కొనసాగుతున్నాడు ఇటీవల వాజేడు మండల కేంద్రంలోని వైన్ షాపు ఆయనకు రాకపోవడంతో ఆ షాపు వచ్చిన వ్యక్తులతో సిండికేట్ వ్యాపారం కొనసాగించడానికి స్థానిక గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించి ఆ షాపును తనవైపు తిప్పుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఏదో విధంగా ములుగు జిల్లా లోని వాజేడు వెంకటాపురం మండలాలలో తన ప్రాబల్యం సూచించాలని ఆలోచనతో ఓ ప్రముఖ పత్రిక విలేకరి ముసుగులో ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు మరో మండలానికి చెందిన పత్రికా విలేఖరి చేదోడువాదోడుగా నిలిచి ఈ అక్రమ వ్యాపారాలకు చేయూతను అందించడం ఏజెన్సీ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని మండల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించాలి .మద్యం ప్రియులను దోపిడీ నుండి కాపాడాలని కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: