CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా ధర్నా కార్యక్రమం.మణుగూరు లో విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం.

Share it:

 





  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో పండిన మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్


మన్యం టీవీ ,మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

మణుగూరు మండల కేంద్రంలో మరియు మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై మొండి వైఖరి ని నిరసిస్తూ, *ప్రధాని మోడీ దిష్టి బొమ్మను* దహనం చేయడం జరిగింది.అనంతరం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి,రైతులను నడ్డివిరిసే నిర్ణయాలతో నల్లచట్టలను తెచ్చి,దేశంలో రైతు సోదరులను గందరగోళంలో పడేసింది అన్నారు.అదే విధంగా దేశంలో ఆహార భద్రతా చట్టం కేంద్రం పరిధిలో ఉంటుంది అని,కేంద్రం అధికారాన్ని దగ్గర పెట్టుకొని రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.ఉత్తరప్రదేశ్,పంజాబ్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్న నేపద్యంలో నల్లచాట్టాలను వెనక్కు తీసుకున్నట్లు,ప్రకటించి కేంద్రం డ్రామాలడుతుంది అన్నారు. బాధ్యతను మరిచి ఇష్టం వచ్చినట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అని,కేంద్ర నాయకులు,రాష్ట్ర నాయకుల కు పొంతనలేని మాటలతో రైతు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని మండిపడ్డారు.తెలంగాణ లో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, కార్యదర్శులు రాంరెడ్డి,నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: