CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్రం తీరుపట్ల ఈ నెల 20వ తేదిన చవుడప్పు నిరసన కార్యక్రమం విజవంతం చెయ్యండి.కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి--:ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించాలి-టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్‌

Share it:

 





మన్యం టీవీ,పినపాక : 

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేవలం రైతులను ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం సాధించేదేమిలేదన్నారు. రైతుల ఉసురు తప్పకుండా బీజేపీ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. వర్షాకాలంకు చెందిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసనలు తెలుపుతామన్నారు. ఈ నెల 20వ తేదిన ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ,వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి,రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు,ఉడుముల లక్ష్మిరెడ్డి,బొలిశెట్టి నర్సింహారావు,ముక్కు వెంకటేశ్వరరెడ్డి, పొనుగోటి కామేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బిల్లం సాంబశివరావు, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు యాంపాటి సందీప్‌ రెడ్డి, కంది సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: