CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి.

Share it:

 


  • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.
  • మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కివినతిపత్రం అందజేత.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు,నల్లేల కుమారస్వామి సూచన మేరకు,తాసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం మండల అధ్యక్షులు మాట్లాడుతూ..ధరల నియంత్రణలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కనీసం సామాన్య మానవునికి అందుబాటులో ఉండే నిత్యవసర ధరల విషయంలో కూడా చూసీ చూడనట్టు ప్రభుత్వాలు చూస్తున్నాయని సామాన్య మానవుడు కూరగాయలు అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి ఉన్నట్టు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అన్నారు.పేద మధ్యతరగతి కుటుంబాలు రెండు పూటలా అన్నం తిందాం అంటే కూరగాయలు 

కొనేలాగా లేదని పప్పులు ఉప్పులు కారం,వీటి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని ఉల్లిగడ్డ కొందామంటే కండ్లకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉల్లి గడ్డ ధర కూడా ఆకాశాన్ని అంటిదని అన్నారు.ఏది కొనలేని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్1000/రూపాయలు,డీజిల్100/రూపాయలు,పెట్రోల్120/రూపాయలు,ఉన్నాయని అన్నారు.ధరల పెరుగుదల సామాన్య మానవుని పై పడిందని,35 రూపాయలు ఉన్న పెట్రోలు 120 రూపాయలు పోయిందని,25 రూపాయల ఉన్న డీజిల్ ధర 99 కి చేరిందని,300 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర 1000 వెయ్యి రూపాయలకు పోయిందని, ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్తును తుంగలో తొక్కుతున్నాయనీ,ప్రజల ఆర్థిక పరిస్థితులపై బారం పడి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వాలు ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్శ వడ్ల వెంకన్న,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, 

జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, 

మండల ఉపాధ్యక్షుడు ఎండి రియాజ్ జియా,జిల్లా నాయకులు ముక్కెర లాలయ్య,పడిదల హనుమంత్,యూత్ నాయకులు సంపత్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: