CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దేశాభివృద్ధి జరిగిందనడానికి ఇందిరాగాంధీ పాలనే సాక్ష్యం

Share it:

 


  • బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ
  • భారతదేశ అభివృద్ధి లో కీలకపాత్ర పోషింది కాంగ్రెస్ పార్టీ
  • పినపాక  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ 104వ జయంతి వేడుకలు

మన్యం టీవి, పినపాక:

భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ పాలనలో నేనని భారతదేశంలోని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంత బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందనేదానికి ఇందిరమ్మ పాలన ఒక్కటే సాక్ష్యమని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోగల పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడిశాల రామనాథం మాట్లాడాతు.

నిస్వార్థ రాజకీయ ప్రధానిగా అడుగిడి స్వార్థానికి ఆమడదూరంలో ఉంటూ పేదలు ఆర్థికంగా ఎదగాలనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానమని అన్నారు.

 భారతదేశాభివృద్ధికోసం ఎనలేని కృషిచేసిన భారత ప్రధానులలో అత్యున్నత ఘనత దక్కించుకున్న మొదటి మహిళా ప్రధాని అని అన్నారు.

ఆహర్నిషలు కష్టపడి నిరుపేదల అభివృద్ధికోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధికే దక్కుతుందని అన్నారు.


సాగు, తాగు నీరు లేక కష్టపడుతున్న దళితుల అభివృద్ధి కోసం నిర్విరామ కృషి చేసిన ఘనత ఇందరాగాంధిదేనని అన్నారు.


- ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు తోడుగా ఉంటుందని అన్నారు .


ఆరుగాలం కష్టం చేసి రైతన్నలు పండించిన వంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు .


కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం స్వార్థపూరిత రాజకీయాల కోసమేనని అన్నారు .


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి రైతులను మోసం చేసేందుకు ఇరు పార్టీల వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుందని విమర్శించారు.


- ప్రస్తుతం కొందరు నాయకులు స్వార్థరాజకీయాలను చేస్తూ ఆర్థికంగా బలపడడానికే తప్ప ఇంకోకటి లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.కె మదర్ సాహెబ్, మండల ప్రధాన కార్యదర్శి  జక్కా వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ జాడి రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీను, బీసీ సెల్ ప్రెసిడెంట్ మునగాల వెంకటేశ్వర్లు, మహిళా మండలి అధ్యక్షురాలు పాయం  సమ్మక్క, మండల సభ్యులు పూనెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: