CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించే పాత్ర ఎంపీటీసీ లదే.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే ప్రజలు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ ల ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా నిర్వహించుకుంటామని,

ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించే బాధ్యతలో  ఎంపీటీసీలదే కీలకం పాత్ర అని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,ములుగు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ అన్నారు.

ములుగు నియోజకవర్గ ఎంపీటీసీ ఫోరమ్,ఎంపీపీ ల ముఖ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ...అతి విశాలమైన మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అందుకని స్థానిక స్వపరిపాలన విధానంలో ఎంపీటీసీ ల పాత్ర ఏర్పాటైందని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంపీటీసీ లకు,జడ్పీటీసీ లకు గౌరవ వేతనాలు అందించారని,

ములుగు జిల్లా ఎంపీటీసీ ల సమస్యలు అన్ని కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి,జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక జయరామ్ నాయక్,

ములుగు మండలం జడ్పీటీసీ సకినాల భవాని,ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్,వెంకటాపుర్ మండలం అధ్యక్షులు లింగాల రమణ రెడ్డి,ములుగు వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,ఎంపీటీసీ తొగరి అశోక్,బాషబోయిన పోశాలు,చికార్తి మధు యాదవ్,భమాండ్లపెళ్లి అనిల్,

ఏటూరునాగారం మండల అధ్యక్షులు గడదాస్ సునీల్ కుమార్, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ్ నాగరాజు,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఎంపీటీసీ కోట నర్సింహులు, ఎండి ఖాజా పాషా,

గోవిందరావు పేట మండల అధ్యక్షులు సురపనేని సాయి బాబు,గోవిందరావుపేట ఎంపీపీ సూది శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు,సర్పంచ్ రేగురి రవీందర్ రెడ్డి,తాడ్వాయి మండల అధ్యక్షులు అనిశెట్టి రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: