CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బినామీ మద్యం దుకాణాలు రద్దు చేయాలి.ఎస్టి, ఎస్సి,గౌడ సంఘాల నాయకుల డిమాండ్....

Share it:

                 




          చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: రాష్ట్రంలో ఇటీవల టెండర్ల ద్వారా ఎంపికైన బినామీ మద్యం దుకాణాలను రద్దు చేయాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎస్టి, ఎస్సి, గౌడ సంఘాలకు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని,అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో దుకాణానికి రెండు లక్షల రుసుము నిర్ణయించడంతో  ఆ డబ్బులు కట్టే స్తోమత లేక టెండర్లో పాల్గొనలేదని తెలిపారు.మద్యం టెండర్లను రద్దు చేసి 50వేల రూపాయలు రుసుముతో లైసెన్సులు  తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర, తెలంగాణ అగ్రవర్ణాల పేర్లతో బినామి మద్యం దుకాణాలను దక్కించుకున్నారని ఆరోపించారు.ఈనెల 29న అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని అన్నారు. దీనికి ప్రజలు అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.అదేవిధంగా ఎంఆర్ పి కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని, దీంతోపాటు మద్యం దుకాణాలలో కల్తీ మద్యం విక్రయిస్తూ దండుకుంటున్నారని ఆరోపించారు.ఒకటో తారీఖున కొత్త మద్యం దుకాణాలను తెరవానియమని  హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, గౌడ సంఘాల నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, వాసం రామకృష్ణ దొర,రాజేష్ కుమార్, వెంకన్న, రమేష్,పిచ్చయ్య, నీలవర్ణ మోహన్నాయక్,రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: