CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి ముగింపు వేడుకలు..

Share it:

 




మన్యం టీవీ :  జూలూరుపాడు, అక్టోబర్ 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసీల ఆరాధ్యదైవం, జల్ జంగిల్ జమీన్ నినాదం తో నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసి గుడేలను ఏకం చేసి మావే నాటే మావే రాజ్ అంటూ ఉవ్వెత్తున ఉద్యమ కెరటమై నిజాం పాలకులను గడగడలాడించి, నిజాం సైనికులతో హోరాహోరీగా పోరాడి అమరుడైన గోండు బొబ్బిలి కొమరం భీమ్ 81 వ వర్ధంతి సందర్భంగా జూలూరుపాడు కొమరం భీమ్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఆదివాసి జెండాను ఎగురవేశారు. అనంతరం కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. కొమరం భీమ్ 121వ జయంతి, 81వ వర్ధంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆదివాసి తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. కొమరం భీమ్ వర్ధంతిని, ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్రం లో ఆదివాసిలు అభివృద్ధికి నోచుకోక పోగా, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు కాలరాస్తూ పాలకులు, ఆదివాసీలను అడవికి దూరం చేయ్యాలని చూస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న జీవోల ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టును  ఆదివాసి గిరిజనులకు కేటాయించాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా కొంతమంది అధికారులు గిరిజనేతరులకు కూడా అవకాశం ఉందంటూ గిరిజనులను తప్పుదోవ పట్టించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆదివాసి చట్టాలకు అనుగుణంగా ఆదివాసి గిరిజనులతో ఆరోగ్య శాఖ లో ఉన్న ఖాళీలను పూర్తి చేయ్యాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై ఆదివాసి ప్రాంతంపై పాలకులు, గిరిజనేతరులు అధికారం చెలాయించాలనే ఆలోచన మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి ఆదివాసి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు అరెం రామయ్య, కుర్సం సీతారాములు,యదళ్ళపల్లి వీరభద్రం,కన్నా రాజు,సంఘం నాగరాజు, పూసం సుధీర్, కొర్సా శ్రీరామ్, సిద్ది బోయిన పుల్లారావు, సర్పంచులు యదళ్ళపల్లి కళాశ్రీ,దొడ్డా వెంకటరామారావు,గలిగే సావిత్రి, దిశ పౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కొడెం సీతాకుమారి, తెల్లం ప్రసాద్, బొర్ర ప్రసాద్, ముక్తి వెంకటేశ్వర్లు, సిద్దిబోయిన వెంకటేశ్వర్లు, మల్కమ్ విక్రమ్,ముక్తి ప్రసాద్, మరియు కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల దొర, పటేల్, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: