CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్ట్ కార్మికుల ప్రైవేటు వాహన డ్రైవర్ల, pvt వైద్య సిబ్బంది జీతాల చెల్లింపు లో జాప్యం నివారించాలి ఐ ఎఫ్ టి యు

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

              మణుగూరు ఏరియా లో కాంట్రాక్ట్ కార్మికుల ప్రైవేటు వాహనాల డ్రైవర్ల ప్రైవేటు వైద్య సిబ్బంది జీతాల చెల్లింపు లో జాప్యం నివారించాలని ఏరియా హాస్పిటల్ వార్డు బాయిల ఇన్సెంటివ్ తక్షణమే చెల్లించాలని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ అటెండర్ బుక్కులు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో గురువారం సాయంత్రం ఏరియా పర్సనల్ మేనేజర్ రాజేశ్వర రావు గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నాసర్ పా షా, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా లో పలు విభాగాల్లోని కాంట్రాక్ట్ కార్మికులకు ప్రైవేటు వైద్య సిబ్బందికి ప్రైవేటు కన్వినెన్స్ వాహనాల డ్రైవర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు అందడం లేదని ఇదేమిటని ప్రశ్నిస్తే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆయా కాంట్రాక్టర్లు చెబుతున్నారని యాజమాన్యం స్పందించి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో అనగా 7వ తేదీ లోగా జీతాలుచెల్లించే తగు చర్యలు చేపట్టాలని సింగరేణి యాజమాన్యానని కోరారు ,కోల్ బెల్ట్ ప్రాంతంలో ప్రతినెల 3 నుండి 10వ తేదీ లోగా కార్మికుల ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయని ఆ సమయానికి జీతాలు రాకపోతే పాల వాడికి ,ఇంటి కిరాయి కి కరెంటు బిల్లు కు , పిల్లల స్కూల్ ఫీజు కు , చిట్టీలు డ్వాక్రా గ్రూపులకు,సమాధానం చెప్పలేక కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు బిల్లులతో సంబంధం లేకుండా ప్రతి నెల 3 ,4 తేదీలలో జీతాలు చెల్లిస్తున్న కాంట్రాక్టర్లకు కూడా ఉన్న ఎక్కువమంది కాంట్రాక్టర్లు జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు

      జీతాల్లో జాప్యం జరుగుతున్న విభాగాలు

    1) పీకే ఓసి లో HEMM ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు, 2)ఏజెంట్ ఆఫీస్ సివిక్, 3)బేస్ వర్క్ షాప్ సివిక్,4) వాషింగ్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు,5) సివిల్ డే టుడే, 6)ఏరియా హాస్పిటల్ cooking హెల్పర్స్, 7)మణుగూరు ఓసి HEMM ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు, 8)కొండాపురం ఇన్ పుట్ బెల్ట్ క్లీనింగ్, తదితర విభాగాలు అలాగే సింగరేణి ఏరియా హాస్పిటల్ వార్డు బాయ్ ల ఇన్సెంటివ్ సమస్యను కూడా సత్వరమే చెల్లించాలి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు మెడికల్ అటెండేన్స్ బుక్కులు వెంటనే ఇవ్వాలని వినతి పత్రం లో కోరామన్నారు, ఈ కార్యక్రమంలో మంగీలాల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: