CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామాలలో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి... మండల ప్రత్యేక అధికారి సంజీవరావు..

Share it:

 


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామాలలో నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి సంజీవరావు వైద్య శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఆయన బెండాలపాడు, చండ్రుగొండ, తిప్పనపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులను అడిగి వ్యాక్సినేషన్ ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మండలంలో 92 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిందని, రెండో డోసు సైతం వేసుకోవడంతో పాటు, మొదటి డోసు నూటికి నూరుశాతం అయ్యోలా చూడాలన్నారు. గ్రామాలలో యువకులు, మహిళా సంఘాల సహకారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాకేష్ కుమార్, మండల పంచాయతీ అధికారి తులసీరామ్, జి పి సెక్రెటరీలు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: