CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏటూరు నాగారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

Share it:

 




ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాలల వేసి, నివాళులు అర్పించిన,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రములో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకురాలు అని ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాడికి అండగా నిలబడిన గొప్ప నేత ఇందిరా గాంధీ కొనియాడారు. ఇందిరాగాంధీ ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. 1972లో భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. మెక్సిక‌న్ అకాడ‌మీ అవార్డు ఫ‌ర్ లిబ‌రేష‌న్ ఆఫ్ బంగ్లాదేశ్ (1972), ఎఫ్ఏఓ రెండ‌వ వార్షిక మెడ‌ల్ 1973,న‌గ‌రి ప్ర‌చారిణీ స‌భకు చెందిన సాహిత్య వాచ‌స్ప‌తి (హిందీ) అవార్డు (1976) అందుకున్నారు.1953లో అమెరికాకు చెందిన మ‌ద‌ర్స్ అవార్డును స్వీక‌రించారు. దౌత్య‌వేత్త‌గా అందించిన సేవ‌ల‌కు గాను ‘ఇసిబెల్లా డి ఎస్టే అవార్డు ఆఫ్ ఇట‌లీ’ని, ఏల్ యూనివ‌ర్శిటీకి చెందిన హాలెండ్ మెమోరియ‌ల్ ప్రైజ్‌ను అందుకున్నారు. 1967,1968 సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఒపీనియ‌న్ స‌ర్వేలో అత్యంత అభిమాన మ‌హిళ‌గా అవార్డు అందుకున్నారు.1971 అమెరికాలోని ప్ర‌త్యేక గ్యాల‌ప్ పోల్ స‌ర్వేలో ప్ర‌పంచ అత్యంత అభిమాన నేత‌గా గౌర‌వం అందుకున్నారు.జంతు సంర‌క్ష‌ణ‌కు చేసిన కృషికిగాను ఇలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీ దీ అని  అన్నారు. హరిజన,గిరిజన మైనార్టీ, సంక్షేమం కోసం ఎంతో పాటుపడినారాని,అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయుబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, వావిలాల ఎల్లయ్య, వావిలాల నరసింగరావు,యూత్ అద్యక్షుడు వసంత శ్రీనివాస్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి, ఎండీ గౌస్,మండల నాయకులు సప్పిడి రాము, ముక్కెర లాలయ్య,పెద్ద బోయిన నరసింహారావు,

మండల ఉపాధ్యక్షుడు రియాజ్ జియా,ఎండి సులేమాన్,ముస్తఫా,పారుక్,

గడ్డం రాజమొగిలి,గడ్డం చంద్ర మొగిలి,తాళ్లపల్లి నరేందర్, చింతకింది రాజు,గడ్డం మహేష్, పడిదల హనుమంతు, వావిలాల సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: