CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి ఆధ్వర్యంలో కొత్త మల్లేపల్లి లో నిర్వాసితులకు మొక్కల పంపిణీ

Share it:

 



పర్యావరణ పరిరక్షణ తోనే మానవ జాతి మనుగడ: పర్యావరణ అధికారి జె. శ్రీనివాసరావు


మన్యం టీవీ మణుగూరు:

పర్యావరణ పరిరక్షణ తోనే మానవజాతి మనుగడ సాధ్యమని,దీనికై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,వాటిని సంరక్షించాలని సింగరేణి మణుగూరు ఏరియా పర్యావరణ అధికారి జె. శ్రీనివాసరావు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సింగరేణి నిర్వాసిత కొత్త మల్లె పల్లి గ్రామంలో గ్రామస్థులకు కొబ్బరి, మామిడి,జామ,నిమ్మ ,లాంటి పండ్ల మొక్కల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏరియా జిఎం జక్కం.రమేష్, ప్రత్యేక శ్రద్ధతో సమీప గ్రామాల లో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టామని,ఈ కార్యక్రమాన్ని నిర్వాసిత గ్రామాలు సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మనిషి ప్రాణాలతో ఎంతగా చెలగాటం ఆడుకుందో ఎంత మంది దాని బారిన పడి, తమ విలువైన ప్రాణాలను కోల్పోయారో మనం చూశామని,ఆక్సిజన్ అందక అనేకమంది మృత్యువాత పడిన సంఘటన కూడా మనం విన్నామని,ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన గ్రామస్తులకు పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ హరితహారం స్ఫూర్తితో ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి యాజమాన్యం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఉచితం అని నిర్లక్ష్యం చేయకుండా,వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు.రామానుజవరం సర్పంచ్ బాడిస సతీష్ మాట్లాడుతూ మొక్కల పంపిణీ లాంటి మంచి కార్యక్రమం సింగరేణి యాజమాన్యం చేపట్టడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగం పర్యవేక్షకులు బి సతీష్ సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్డీ.నాసర్ పాషా, మంగీలాల్, గ్రామస్తులు డేగల కృష్ణారావు,కర్రీ రాములు, జూపాక ఇజ్రాయిల్,గంధం రామారావు,కట్ట ప్రసాద్, కట్టా రవి,డేగల రాజకుమారి,డేగల రాములమ్మ,నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: