CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్య పరిష్కరించే వరకు భూముల అక్రమ ఆక్రమణ నిలుపుదల చేయాలి

Share it:

 


సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ

మన్యం టీవి,అశ్వాపురం:

 టిఆర్ఎస్ ప్రభుత్వం  పోడు భూముల సమస్యలు పరిష్కరించే వరకు ఏజెన్సీలోని పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారులు  దాడులు చేసి పోడు భూముల అక్రమ ఆక్రమణకు పాల్పడటాన్ని ఆపాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అఖిల భారత రైతు కూలి సంఘం అశ్వాపురం మండల కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు మణుగూరు మండల కార్యదర్శి దుబ్బాక జగ్గన్న అన్నారు. అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీలో సొంత ఆస్తిహక్కులేని ఆదివాసీలు నిరుపేదలకు పోడు భూములు జీవనాధారంగా ఉన్నాయని హరితహారం పేరుతో ఇప్పటికే కొన్ని వేల హెక్టార్ల పోడు భూమి గుంజుకోవడంతో ఇప్పటికే  భూములు కోల్పోయిన ఆదివాసీలు పేదలు వందల సంఖ్యలో కుటుంబాలు పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు రాష్ట్రంలో పోడు భూముల సమస్య గురించి స్పందించిన ప్రభుత్వం ఫారెస్ట్ దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించలేదని అన్నారు  హరిత హారంలో పూర్తిగా భూములు కోల్పోయిన కుటుంబాలకు తిరిగి భూములను ఇవ్వాలనిి



 ఇప్పటికైనా ప్రభుత్వం పోడు సాగు దారులపై ఫారెస్ట్  అధికారుల దాడులను నిలిపివేయాలని పోడు భూముల అక్రమ ఆక్రమణ ఆపాలని పోడు సాగు దారులందరికీ షరతులు లేకుండా పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


దళిత బంధుకు షరతులు ఎందుకు ? 


హుజూర్ నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బందు పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి అనేక షరతులు పెట్టడం సరికాదన్నారు రైతుబంధు పథకానికి షరతులు  పెట్టకపోవడంతో ధనవంతులకు భూస్వాములకు లక్షల రూపాయలు వారి ఖాతాల్లోకి వెళ్లాయని అన్నారు  పేదల కంటే భూస్వాములకు ధనవంతులకు ఎక్కువ మేలు జరిగిందన్నారు దళితుల విషయానికి వచ్చేసరికి దళిత బంధు పథకానికి అనేక షరతులు పెడుతున్నారని ఇది సరైందికాదన్నారు ఎలాంటి షరతులు లేకుండా దళితులు అందరికీ దళిత బందు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు

 ఈ కార్యక్రమంలో అచ్చయ్య వెంకన్న రాంబాబు సమ్మక్క వీరాచారి గోపయ్య విక్రమ్  తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: