CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేము సైతం ఆధ్వర్యంలో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,డిఐజి, నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్

Share it:

 




మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం అని విప్ రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం గుట్టమల్లారం లోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఐపీఎస్ డిఐజి,నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్,ఎస్పి,సి ఐ డి హైదరాబాద్ ఎల్. సుబ్బారాయుడు,బి టి పి ఎస్ సిఈ బాలరాజు,డాక్టర్ ఎర్రం శెట్టి నందకిషోర్ చైర్మన్ గమన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చేతులమీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అతిథులు జెండా ఊపి ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.


పేద ప్రజల బాధలు తెలుసుకుని వారి సౌకర్యం కోసం ఉచిత ఆంబులెన్స్ కు శ్రీకారం చుట్టిన పసునూరి. భాస్కర్ మాట్లాడుతూ అత్యవసర సేవలకు,పేద ప్రజల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సేవలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.భద్రాచలం,కొత్తగూడెం,అవసరమైతే ఖమ్మం వరకు పేషెంట్లు తరలించడం జరుగుతుందన్నారు.రోగిని ఆస్పత్రికి చేర్చే వరకు ఉచితంగానే సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.తనపై ప్రేమ,గౌరవం తో వచ్చిన అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


ఆపదలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే అసలైన సంతృప్తి కలుగుతుందని డీఐజీ,నల్గొండ జిల్లా ఎస్పి రంగనాథ్ అన్నారు. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.మేము సైతం ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ట్రస్ట్ వ్యవస్థాపకులు భాస్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని మేము సైతం మిత్రమండలి సేవలను మరింత విస్తరించలన్నారు.సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన సేవా కార్యక్రమాలకు నిరంతరాయంగా కొనసాగించాలని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.


విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ఏజన్సీ లో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు. మేము సైతం ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం, ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.రెండేళ్ళ కాలంలో మేము సైతం చేపట్టిన సేవలు ప్రశంసనీయమన్నారు.ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని,మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ద్వారా వారు ఆర్థికంగా ఎదిగేందుకు,వారికి ఉపాధి కల్పించే విధంగా,మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయ పడుతుందన్నారు.అందరి సహకారంతో మేము సైతం మిత్రమండలి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ దోసపాటి.నాగేశ్వర రావు,పిచ్చెశ్వరరావు,నాగేశ్వర రావు,పీవీ చారి,రంగా శ్రీనివాస్, మణుగూరు పట్టణ ప్రముఖులు,మేముసైతం మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: