CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మదిలో,గనిలో,పనిలో రక్షణ సూత్రాలు పాటించండి: ప్రమాదాలు నివారించండి.పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి మాలోత్ రాముడు

Share it:



మన్యం టీవీ మణుగూరు: మదిలో,గనిలో,పనిలో రక్షణ సూత్రాలు పాటించాలని, ప్రమాదాలు నివారించాలని,పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి మాలోత్. రాముడు అన్నారు.శుక్రవారం ఉదయం పీకే ఓసి సెక్షన్ 2 లో మట్టి వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్ ఇన్ ఫ్రా ఓబి కంపెనీలో జరిగిన రక్షణ మన బాధ్యతసేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్* ఓబి వర్కర్స్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మన రక్షణే,మన కుటుంబ రక్షణ అని,భారీ యంత్రాలు నడిపే డ్రైవర్లు, ఆపరేటర్లు ఇంటి వద్దనే సరైన విశ్రాంతి తీసుకోవాలని,సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ,డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంగ్ కానీ,మత్తు పదార్థాల్ని సేవించి యంత్రాలు నడపకూడదనీ విధినిర్వహణ లో,అనుక్షణం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని తెలిపారు.తమ పొరపాటు మూలంగా తమకు గాని,తమ తోటి కార్మికులకు లేదా యంత్రాలకు గాని ప్రమాదాలు జరగకుండా,ఎవరికి వారే, స్వీయ రక్షణ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని,తద్వారా సింగరేణి యాజమాన్యం, ప్రమాద రహిత సింగరేణి లక్ష్యం సాధ్యమని,ఉత్పత్తితో పాటు రక్షణ కూడా మన బాధ్యత, మర్చిపోరాదని ఆయన కార్మికులను కోరారు.వి పి ఆర్ యాజమాన్యం కూడా రక్షణ చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు.వోల్వో డ్రైవర్ అలుగుల రాజు ఎస్ ఓ పి చదివి వినిపించారు.అనంతరం కార్మికులందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణాధికారి ఎం.లింగ బాబు,ఓబి ఇన్ ఛార్జ్ అధికారి వీసం.నాగరాజు అడిషనల్ మేనేజర్,జి.నాగరాజు సీనియర్ అండర్ మేనేజర్,జి.రాగన్ బాబు, హెడ్ ఓవర్ మెన్,వి పి ఆర్ యాజమాన్యం శేషారెడ్డి, వెహికల్ ఇన్ ఛార్జ్ రవీందర్ రెడ్డి,ఎస్ ఓ పి సమన్వయకర్త ఎస్డీ.నాసర్ పాషా,భారీ యంత్రాల ఆపరేటర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: