CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

న్యాయం దృష్టిలో అందరూ సమానులే జిల్లా జడ్జి నందికొండ నాగేశ్వరరావు.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

న్యాయం దృష్టిలో అందరూ సమానులే న్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదు అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా గాని ఇతర బలహీనత మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించిందిని వరంగల్ జిల్లా జడ్జి నందికొండ నాగేశ్వరరావు,ములుగు జిల్లా జడ్జి రామచంద్ర రావు,ప్యానల్ అడ్వకేట్ మహేందర్ లు అన్నారు.మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఈసo రామ్మూర్తి అధ్యక్షతన ఉచిత న్యాయ సహాయం చట్టాలు న్యాయాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీద బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం వారికి సామాజిక ఆర్ధిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు.ఫలితంగా 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 - ఏ జత చేసి బీద బలహీన వర్గాలవారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత నిర్దేశించినారని అంతే కాకుండా ఇందు కోసం ఒక చట్టాన్ని రూపొందించారని అదే న్యాయ సేవల అధికారిక చట్టం ఇది కేంద్ర చట్టం ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారని,అర్హులు ఈ చట్టం దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనబరిచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులం లేక తెగకు చెందిన వారు మానవ అక్రమ రవాణా బాధితులు బేగారులు, స్త్రీలు,పిల్లలు,మతిస్థిమితం లేని వారు,వారు సామూహిక కుల వైషమ్యాలు అతివృష్టి అనావృష్టి భూకంపాలు పారిశ్రామిక విపత్తుల వంటి విపత్తులలో చిక్కుకున్నవారు. పారిశ్రామిక కార్మికులు ఇలాంటి వారికి వార్షికాదాయం మూడు లక్షలకు మించి ఉన్న వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు.అర్హతగల వాది ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. *దరఖాస్తు చేయు పద్ధతి* న్యాయ సహాయం కోరువారు తమ కేసు యొక్క పూర్వపరాలు కావలసిన పరిష్కారము రిలీఫ్ వివరిస్తూ సంబంధిత డాక్యుమెంట్లను జతచేయండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలతో కలిగి ఉన్నది తెలియపరుస్తూ తగిన ఆధారాలను పంపిన యెడల నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోబడును దరఖాస్తు చేయవలసిన చిరునామా ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థల రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ గాని తమ యొక్క కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకున్న వలెను అన్నారు.జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు గ్రామ స్థాయిలో చట్టాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కార్యక్రమం కల్పించి ప్రజలు కలహాలు కక్షలు లేకుండా స్నేహపూర్వకంగా జీవితాన్ని గడిపే విధంగా చర్యలు చేపట్టడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ కోఆప్షన్ సభ్యులు వలియాబి సలీం,ఏటూరు నాగారం ఎస్ఐ శ్యాంసుందర్,డోలు దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప వీరయ్య,అంగన్ వాడి టీచర్స్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: